Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
కొండాపుర్ డివిజన్నగర్లో బీజేపీ తరుపున ఆదివారం ఉదయం బస్తీబాట కార్యక్రమాన్ని బీజేవైఎం కోశాధికారి, కొండాపూర్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ మారబోయిన రఘునాథ్ యాదవ్ నిర్వహించారు. కాలనీలోని సమస్యలను పరిశీలించారు. ఆయన మాట్లడుతూ కాలనీవాసులకు శ్మశానవాటిక లేదని, అంగన్వాడీ కేంద్రం ఆవరణలో చెత్తాచెదారం పేరుకుపోయిందని తెలిపారు. రోడ్లు, డ్రయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నాయన్నారు. ఉచిత కరెంటు, తాగునీరు అంటూనే రాష్ట్ర ప్రభుత్వం ఆరునెలలకు మంజీరా తాగునీటి బిల్లును రూ.2 వేల నుంచి ఏడు వేల వరకు ఇవ్వడం బాధాకరం అన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే స్పందించి సమస్యలను పరిష్కరించాలన్నారు. ఆయన వెంట యూత్ అధ్యక్షుడు విష్ణు, సీనియర్ నాయకులు ఆంజనేయులు, అజరు, ప్రేమ్, హరి, సతీష్, పెంటయ్య, డేవిడ్, అజరు కుమార్, మహిపాల్, నరేష్, సాయి, బీజేపీ, బీజేవైఎం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.