Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహరెడ్డి
నవతెలంగాణ-కందుకూరు
టీపీసీసీ ప్రెసిడెంట్‌గా నియమితులైన రేవంత్‌రెడ్డితోనే కాంగ్రెస్‌కు పూర్వ వైభవం వస్తుందని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహరెడ్డి అన్నారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని నియమించడం సంతోషకరమైన విషయమన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో రేవంత్‌ను ఆయన నివాసంలో జడ్పీ మాజీ ఫ్లోర్ లీడర్ ఏనుగు జంగారెడ్డి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి పూలమాలలతో సత్కరించారు. ఆయన మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్‌కు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు జిల్లా వ్యాప్తంగా కమిటీలు నియమిస్తామన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి ఎంపిక పట్ల కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో పీసీసీ సెక్రటరీలు అమరేందర్ రెడ్డి, జానకీరామ్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు భావాత్ కష్ణ నాయక్, కార్పొరేటర్ చల్లా బాల్‌రెడ్డి, కాంగ్రెస్ యువజన సంఘం మండల అధ్యక్షులు ఢిల్లీ శ్రీధర్, వర్కింగ్ ప్రెసిడెంట్ రాణా ప్రతాప్‌రెడ్డి, సహకార సంఘం డైరెక్టర్ జగదీశ్వర్ రెడ్డి, ఎన్ఎస్యూఐ నాయకులు వినోద్‌చారి, నాయకులు యాదయ్య, శ్రీనివాస్ రెడ్డి, భాస్కర్, మహేష్, శ్రీధర్, సురేందర్‌రెడ్డి, రవి నాయక్, హరికిషన్ పాల్గొన్నారు.