Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
కర్ణాటక రాష్ట్రం నుండి వలస వచ్చిన కార్మికులకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నిర్వహించబోయే లాంగ్‌టర్మ్ లిటరసీ ట్రైనింగ్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ కాగ్నిటివ్ ఫంక్షనింగ్ ప్రాజెక్ట్ ఎంతో ప్రతిష్టాత్మకమైనది. ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం కర్ణాటక నుంచి తెలంగాణకు వలస వచ్చి కూలీలకు తెలుగు రాయడం, చదవడం నేర్పించడం. దీంతోపాటు ఎనిమిది నెలల పాటు వారి పనితనాన్ని గమనించనున్నారు. ఈ వినూత్నమైన కార్యక్రమాన్ని శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని గోపినగర్ ప్రభుత్వ పాఠశాలలో ఆదివారం ప్రారంభించారు. కార్యక్రమం కోసం యూనివర్సిటీ ప్రొఫెసర్ రమేష్ కుమార్ మిశ్రా, విద్యార్థి బందం, కో ఆర్డినేటర్ వైష్ణవి, సీమ ప్రసాద్, ఫణి కష్ణ, తదితరులు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా శేరిలింగంపల్లి కార్పొరేటర్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, సామాజిక సేవా రత్న అవార్డు గ్రహీత భేరి రాంచందర్ యాదవులు హాజరై ప్రారంభించారు. కార్పొరేటర్ మాట్లాడుతూ రమేష్ కుమార్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నిర్వహిస్తున్న ఈ ప్రాజెక్టు తమ డివిజన్లో ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఎలాంటి సహాయమైనా చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 80 మంది వలస కార్మికులు, మాజీ కౌన్సిలర్ వీరేశం గౌడ్, రవీందర్ యాదవ్, నరసింహ, ప్రభాకర్, సైదులు యాదవ్ పాల్గొన్నారు.