Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్పీఅర్డీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు నర్సింహ
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
హెలెన్ కెల్లర్ ఉద్యమ స్ఫూర్తితో వికలాంగులు ఉద్యమించాలని ఎన్పీఅర్డీ రాష్ట్ర అధ్యక్షులు నర్సింహ పిలుపునిచ్చారు. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక అధ్వర్యంలో ఇబ్రహీంట్నంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద హెలెన్ కెల్లర్ 141వ జయంతిని నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళుల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హెలెన్ కెల్లర్ 27జూన్ 1880న అమెరికాలోని అలబామా రాష్ట్రం టస్కాంబియా అనే ఎరియలో హెన్రీ కెల్లర్, కెట్ ఆడమ్స్ దంపతులకు జన్మించిందని అన్నారు. మానవత్వం కలిగిన మహౌన్నత వ్యక్తి వికలాంగురాలు సాహసమే ఊపిరిగా ప్రపంచాన్ని జయించిన వీర నారి హెలెన్ కెల్లర్ అని కోనియడారు. పుట్టుకతో అంగవికలంగురాలు కాదని ఏడాదిన్నర గడిచిన తర్వాత పెద్ద జబ్బు చేసి, మెదడు తీవ్ర రుగ్మతకు గురై క్రమక్రమంగా చూపు,వినికిడి తర్వాత మాట్లాడే శక్తిని కోల్పోయారని చెప్పారు. హెలెన్ 1908లో సోషలిస్ట్ పార్టీలో చేరిన ఆమె సోషలిజం, ఓటుహక్కు, వైకల్యం హక్కులను సమర్థిస్తూ యునైటెడ్ స్టేట్స్ అంతటా ప్రసంగాలు చేసిందన్నారు. అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ను స్థాపించిందని, ప్రపంచ యుద్ధాల సమయంలో ఆమె శాంతి కోసం నీనదించారన్నారు. సామాజిక వివక్షతకు వ్యతిరేకంగా అలసిపోని కత నిశ్చయంతో ధైర్యంగా ఉద్యమం కొనసాగించారని తెలిపారు. ప్రస్తుతం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగుల పట్ల మొండిగా ఉన్నాయన్నారు. తమ హక్కల సాధనకు హెలెన్ కెల్లర్ స్పూర్తితో ఉద్యమించాలన్నారు.ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు అశాన్నగారి భుజంగ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జేర్కోని రాజు, జిల్లా కోషాదికారి డి రాజ శేఖర్‌గౌడ్, జిల్లా నాయకులు దివిటీ యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.