Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోవిడ్ అదుపులో ఉంటేనే ప్రత్యక్షానికి అనుకూలం
- ఈ సారైనా చదువులు ముందుకు సాగేనా
- ఒకటో తరగతి విద్యార్థుల పరిస్థితి ఏమిటో...
- విద్యా సంస్థల ప్రారంభానికి షెడ్యూల్ ప్రకటించిన విద్యాశాఖ
- శనివారం నుంచి పాఠశాలలకు వస్తున్న ఉపాధ్యాయులు
- వ్యాక్సినేషన్ వేసుకోవడంలో ఉపాధ్యాయులు బిజీ
- దశల వారీగా ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు ప్రభుత్వం మార్గదర్శకాలు
- ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు
విద్యా సంస్థలు ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించింది. అయినప్పటికీ ఏ మేరకు చదువులు ముందుకు సాగుతాయనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పట్లో ప్రత్యక్షం చదువులు లేనట్లేనని తేటతెల్లమైంది. ఆన్లైన్ చదువులకే మొగ్గు చూపింది. ఈ మేరకు ప్రభుత్వం ప్రకటించింది. అంతా ఆన్లైన్లోనే కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. 50శాతం ఉపాధ్యాయులు విధులకు హాజరు కావాలని ఆదేశించింది. కోవిడ్ అదుపులో ఉంటేనే ప్రత్యక్ష చదువుల ప్రారంభానికి ప్రభుత్వం ఒకే చెప్పే అవకాశాలున్నాయి. ఈ పరిస్థితుల్లో గత సంవత్సరం మాదిరిగా కాకుండా ఈ సారైనా చదువులు ముందుకు సాగేనా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకటో తరగతి విద్యార్థుల పరిస్థితి ఏమిటోన్న మీమాంస నెలకొంది. ఇప్పటికే జూలై ఒకటి నుంచి విద్యా సంస్థల ప్రారంభానికి విద్యాశాఖ షెడ్యూల్ ప్రకటించింది. శనివారం నుంచి పాఠశాలలకు ఉపాధ్యాయులు హాజరవుతున్నారు. వారంతా వ్యాక్సినేషన్ వేేసుకోవడంలో బిజీగా ఉన్నారు. అయితే కోవిడ్ కేసుల నమోదును బట్టి దశల వారీగా ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు ప్రభుత్వం ముందడుగు వేసే అవకాశాలున్నాయి. దాంతో రెండేళ్లుగా విద్యార్థుల చదువులపై తీవ్ర ప్రభావం పడుతుంది. దాంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
జూలై 1వ తేదీ నుంచి కళాశాలలు, ఉన్నత పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ముందుగా ప్రత్యక్ష తరగతులు ప్రారంభించాలని అనుకున్నప్పటికీ కోర్టు ఆదేశాల మేరకు ఆన్లైన్ తరగతులను బోధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒకటవ తరగతి నుంచి 6వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్ పాఠాలు బోదించనున్నారు. ఇప్పటికే ప్రకటించిన ప్రత్యక్ష బోదన నిర్ణయాన్ని ఇంటర్ బోర్ల వెనక్కి తీసుకుంది. అయితే అధికారికంగా ప్రకటన రావాఇ్సఉంది. జూనియర్ కళాశాలల్లోనూ ఆన్లైణ్ బో దన చేపటద్టలని నిర్ణయించింది. ప్రతి రోజూ 50శాతం మందిఉపాధ్యాయులు తరగతులకు హాజరు కావాల్సి ఉంటుంది.
నేడు ప్రభుత్వం నిర్ణయం...
ప్రభుత్వం గతంలో జూలై ఒకటి నుంచి పాఠశాలలు ప్రారంభించాలని నిర్ణయించిన విషయం విధితమే. ఆ సందర్భంగా ముందుగా 8నుంచి 10వ తరగతి విద్యార్థులు ప్రత్యక్ష తరగతుల నిర్వహణ చేయనున్నట్లు ప్రకటించింది. అయితే 20వ తేదీ నుంచి 6, 7తరగతులు ప్రారంభించాలని, ఆగస్టు 16వ తేదీ నుంచి ప్రాథమిక తరగతులు ప్రారంభం కానున్నట్టు తెలిపింది. కానీ ప్రస్తుతం కరోనా పూర్తిగా అదుపులోకి రాలేదు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు అయోమయానికి గురయ్యారు. తరగతి గదిలో విద్యార్థులు దగ్గరగా కుర్చుంటారు. కరోనా వైరస్ వ్యాప్పి చెందే అవకాశాలున్నాయి.ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరగతుల నిర్వహణకు నిర్ణయం తీసుకోవడం ఆందోళన కలిగిస్తుందని పలువురు విద్యావేత్తలు విస్మయాన్ని వ్యక్తం చేశౄరు. ఈ తరుణంలో సుప్రీంకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో ప్రత్యక్ష తరగతుల నిర్వహణను వాయిదా వేశారు. ఇక ఆన్లైన్లోనే తరగతులు బోదిస్తామని ప్రకటించారు. అయితే అందుకు సంబంధించిన మార్గదర్శకాలు విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సబితారెడ్డి బేటీ కానున్నారు.
ఏడాదిన్నరగా బడుల మూత...
కరోనా కారణంగా సంవత్సర కాలంగా విద్యాసంస్థలు మూసి ఉంచారు. ఈ సారి ఫిబ్రవరిలో ఇంటర్, పదో తరగతి విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు ప్రారంభించినా మార్చిలో సెకండ్ వేవ్ కారణంగా తిరిగి మూసివేశారు. ఇటీవల జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం జూలై 1వ తేదీ నుంచి విద్యాసంస్థలు ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. కానీ తాజాగా ఆన్లైన్ తరగతుల నిర్వహణే సరైన మార్గమని భావించింది. శుక్రవారం నుంచి ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది పాఠశాలలకు హాజరయ్యారు.
విద్యారంగం అస్తవ్యస్తం
కరోనా మహమ్మారి విద్యారంగాన్ని అస్తవ్యస్తం చేసింది. కరోనా వల్ల విద్యాసంస్థలు మూసివేయడమే గాక పరీక్షలు నిర్వహించడం వీలు కాలేదు. పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల వరుసగా రెండేళ్లు పైతరగతులకు ప్రమోట్ చేయాల్సి వచ్చింది. గత సంవత్సరం విద్యా సంవత్సరం మొత్తం తుడిచి పెట్టుకుపోయింది. పరీక్షలు నిర్వహించకపోవడంతో విద్యార్థుల ప్రతిభకు కొలమానం లేకుండా పోతోంది. ప్రతిభ ఉన్న విద్యార్థులు, ప్రతిభ లేని విద్యార్థులు ఒకటే కేటగిరీకి వచ్చారు. ప్రాథమిక తరగతుల విద్యార్థులు ఏబీసీడీలు రాయకుండానే పైతరగతులకు ప్రమోటవుతున్నారు. సాధారణంగా ప్రాథమిక తరగతుల్లో విద్యార్థులు ఏబీసీడీలు, గణితం నేర్చుకుని పై తరగతులకు వెళ్తారు. వీరు రాయకుండానే రెండు స్టెప్లు పైకి ఎక్కుతున్నారు. అంటే అక్షరాలు, గుణింతాలు, అంకెలు రాకుండా అప్గ్రేడ్ కావడం వల్ల తరగతులు పైకి వెళ్తున్నారు, గానీ విద్యార్థుల్లో సామర్థ్యం పెరగడం లేదు. పైతరగతుల్లో ప్రమోట్ కాబడిన విద్యార్థులకు ఆ తరగతుల సిలబస్ చెప్పాల్సి ఉండగా వారికి బేసిక్ లేకుండా పై తరగతులకు వెళితే వారికి ఏమీ అర్థం కాదు. ఇలా చిరుప్రాయంలోనే విద్యార్థులకు చదువులు అర్థం కాక అయోమయానికి గురయ్యే అవకాశం ఉంది.
జిల్లాలో 3లక్షలకు పైగా విద్యార్థులు
జిల్లాలో ప్రభుత్వ, ప్రయివేటు కళాశాలలు, పాఠశాలల్లో 3లక్షలకు పైగానే విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వం విద్యా సంవత్సరాన్ని ప్రకటించకపోవడంతో వారి భవిష్యత్తు గురించి విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రెండు పర్యాయాలు ఇండ్లకే పరిమితమై చదువును దాదాపు విద్యార్థులు మర్చిపోయే పరిస్థితి ఏర్పడింది. వారి భవిష్యత్తు ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 886ప్రాథమిక పాఠశాలలు, 178 ప్రాథమికోన్నత పాఠశాలలు, 244 ఉన్నత పాఠశాలలు, 20 కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ పాఠశాలలతో పాటు, ఎయిడెడ్ పాఠశాలలు, 1491 ప్రయివేటు పాఠశాలలున్నాయి. ప్రభుత్వ, ప్రయివేటు జూనియర్ కళాశాలలు జిల్లా వ్యాప్తంగా మరో 50 వరకు ఉన్నాయి. వీటిలో పాఠశాల స్థాయిలో 2 లక్షల మందికిపైగా విద్యార్థులు చదువుతుండగా కళాశాల స్థాయిలో దాదాపు 50 వేలకు పైగా విద్యార్థులు చదువుతున్నారు.