Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శంషాబాద్
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ని శంషాబాద్ కు చెందిన కాంగ్రెస్ నేతలు సోమవారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శంషాబాద్ మండల అధ్యక్షుడు గడ్డం శేఖర్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకు వచ్చే సత్తా రేవంత్ రెడ్డి కే ఉందని అన్నారు. ఆయన నాయకత్వంలో రాబోవు ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు . కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎంపిక కావడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ శ్రేణులకు నూతన ఉత్తేజం వచ్చిందన్నారు. ఆయన అడుగు జాడల్లో శంషాబాద్ మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శంషాబాద్ మున్సిపల్ శాఖ అధ్యక్షులు పి. సంజరు యాదవ్, బొబ్బిలి కిష్టయ్య, బొబ్బిలి శేఖర్, ప్రవీణ్, శ్రీశైలం యాదవ్, గౌస్, జగన్, మహేందర్ ముదిరాజ్ రాములు నాయక్, అంజయ్య, సులోచన రాకేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.