Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆమనగల్
తలకొండపల్లి మండలంలోని చౌదర్పల్లికి చెందిన ఊరుకొండ అంజయ్య అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం రాత్రి మతి చెందాడు. విషయం తెలుసుకున్న తలకొండపల్లి జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మతుని కుటుంబానికి స్థానిక నాయకుల చేతులమీదుగా రూ.3,000లు ఆర్థికసాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పెంటమ్మ, మాజీ సర్పంచ్ బాలమైసయ్య, నాయకులు రామస్వామి, పెంటయ్య, కష్ణయ్య, అంజయ్య, జానయ్య పాల్గొన్నారు.
అదేవిధంగా మాడ్గుల మండలం కలకొండకు చెందిన డొంకి కష్ణ అనారోగ్యంతో మతి చెందాడు. ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ సభ్యుడు నాగిళ్ల జగన్ ద్వారా ఉప్పల వెంకటేష్ ట్రస్ట్ ద్వారా మతుడి కుటుంబానికి రూ.3,000లు ఆర్థికసాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాగిళ్ల జగన్, గుండె యాదయ్య, తోట శేఖర్, దార్ల వినోద్, గోపి, తదితరులు పాల్గొన్నారు.