Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొబైల్ వాక్సినేషన్ కేంద్రం ప్రారంభం
నవతెలంగాణ-గండిపేట్
బండ్లగూడలో టీకా ప్రక్రియను వేగవంతం చేయాలని మేయర్ బుర్ర మహేందర్ గౌడ్. డిప్యూటీ మేయర్ పూలపల్లి రాజేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్‌లోని ప్రభుత్వ పాఠశాల వద్ద నార్సింగి ఆస్పత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొబైల్ వాక్సినేషన్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోవిడ్‌ను పూర్తిగా అదుపు చేసేందుకు ప్రజలందరూ సహకరించాలన్నారు. ప్రతి ఒక్కరూ నిర్భయంగా టీకాను వేసుకోవాలని తెలిపారు. కోవిడ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, టీకాలు వేసుకోని వారందరూ తప్పనిసరిగా వేసుకోవాలని సూచించారు. వైద్యులకు పూర్తిగా సహకరించాలన్నారు. ప్రతి రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు వాక్సినేషన్ కేంద్రం అందుబాటులో ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, మున్సిపల్ సిబ్బంది, శానిటేషన్ సూపర్ వైజర్లు పాల్గొన్నారు.