Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గండిపేట్
టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు రేవంత్‌రెడ్డికి అండగా ఉంటామని గండిపేట్ మండల మాజీ అధ్యక్షులు ముంగి జైపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం గండిపేట్ మండలం నార్సింగి మున్సి పాలిటీకి చెందిన కాంగ్రెస్ నాయకులు రేవంత్‌రెడ్డి అభిమానులు ముంగి జైపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆయనను కలిశారు. వారు మాట్లాడుతూ కాంగ్రెస్‌కు పూర్వవైభవం తీసుకోస్తామన్నారు. ప్రజాసంక్షేమాన్ని విస్మరిస్తున్న కేసీఆర్ సర్కారుపై పోరుబాట చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఓం ప్రకాష్ గౌడ్, నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు, కాంగ్రెస్ నేతలు ఉన్నారు.