Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభించిన కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
శేరిలింగంపల్లి నియో జకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి తండాలోని ప్రైమరీ పాఠశాల వద్ద జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కొత్తగా మొబైల్ వాక్సినేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. సోమవారం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై స్థానిక నాయకులతో కలిసి సెంటర్‌ను సందర్శించి, వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడం రాని వారికి మొబైల్ వ్యాక్సినేషన్ సెంటర్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి ఒక్కో మొబైల్ సెంటర్ ద్వారా రోజుకు 150 నుంచి 200 మందికి వ్యాక్సిన్ వేస్తున్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ జలెందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, జీహెచ్ఎంసీ శానిటేషన్ సూపర్వైజర్ రాందాస్, సీనియర్ నాయకులు వెంకటేష్, శ్రీశైలం, ప్రభాకర్, ప్రకాష్ పాల్గొన్నారు.