Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రుణాలు సకాలంలో చెల్లించాలి
- ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి
నవతెలంగాణ-మంచాల
రైతుల సౌలభ్యం కోసమే పీఎసీఎస్ నూతన భవనం ఏర్పాటు చేసినట్టు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన భవనం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాత భవనంలో మౌలిక సౌకర్యాలు లేక రైతులు ఇబ్బందులు పడే వారని, వారి సమస్యలను దృష్టిలో పెట్టుకుని నూతన భవనం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సహకార బ్యాంకులో రైతులకు ఎరువులు, విత్తనాలు, వివిధ రకాలు రుణాలు అందించారనీ, తీసుకున్న రుణాలను రైతులు సకాలంలో చెల్లించి బ్యాంకు అభివృద్ధిలో భాగ స్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మెన్ కొత్త మనోహర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా కో-ఆర్డినేటర్ వంగెటీ లక్ష్మారెడ్డి, ఎంపీపీ జాటొత్ నర్మదాలచ్చిరాం, జడ్పీటీసీ మర్రి నిత్యా నిరంజన్ రెడ్డి, వైఎస్ ఎంపీపీ పొలగొని రాజేశ్వరి, పీఎస్సీఎస్ చైర్మెన్ బుస్సు పుల్లారెడ్డి, పీఎసీఎస్ వైస్ చైర్మెన్ బొద్రమొని యాదయ్య, సీఈవో చింతక్రింది శ్రీనివాస్, ఎంపీటీసీలు నరేందర్రెడ్డి, పల్లాటి జయ నందం, లట్టుపల్లి చంద్రశేఖర్రెడ్డి, చీరాల రమేశ్, కావలి శ్రీనివాస్, సెసరిగాయాల సుకన్య, సర్పంచ్లు అనిరెడ్డి జగన్రెడ్డి, కుకుడాల శ్రీనివాస్ రెడ్డి, పల్లాటి బాల్ రాజ్, మెగావత్ రాజు నాయక్, డైరక్టర్లు వింజ మూరి రాంరెడ్డి, పి.రమేశ్, డండెటికార్, వెదిరే హను మంతు రెడ్డి, సత్యనారాయణ, వేణుగోపాల్ రావు, కసరమొని పద్మ శ్రీశైలం,పెర్క మనేమ్మ తదితరులు ఉన్నారు.