Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యువతకు ఉపాధి అవకాశం
- అభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేయిస్తాం
- ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి
నవతెలంగాణ-యాచారం
ఫార్మాసిటీతోనే గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం ఎమ్మెల్యే సహకారంతో మేడిపల్లి అభివృద్ధికి రూ. కోటి నిధులు మంజూరు చేసిన సందర్భంగా సర్పంచ్ చిగురంత శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పంచా యతీ పాలకవర్గం ఎమ్మెల్యే కిషన్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఫార్మాతో యువతకు ఉపాధి నిండుగా దొరుకుతుందన్నారు. మండల పరిధిలోని మేడిపల్లి, నానక్ నగర్, కుర్మిద్ద తదితర గ్రామాలు ఫార్మాతో అభివృద్ధి చెందుతాయని చెప్పారు. అభివృద్ధి పరంగా మరిన్ని నిధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఎమ్మెల్యే గుర్తు చేశారు. వచ్చిన నిధులతో సర్పంచులు సక్రమంగా ఉపయోగించి గ్రామంలోని సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రయినేజీ, వీధిలైట్లు వంటి అభివృద్ధి పనులను చేసుకోవాలని సూచించారు. సర్పంచులు, ఎంపీటీసీలు గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటి రమేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి భాష, మాజీ ఎంపీపీ రాజు నాయక్, ఎంపీటీసీ శివలీల, వార్డు సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.