Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీపీ కొప్పు సుఖన్య భాష
నవతెలంగాణ-యాచారం
మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో నెలకొన్న మిషన్ భగీరథ పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని ఎంపీపీ కొప్పు సుకన్య భాష కోరారు. సోమవారం ఎంపీపీ ఛాంబర్లో మిషన్ భగీరథ ఏఈ స్రవంతితో మిషన్ భగీరథ వాటర్ సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ మాల్ కేంద్రంలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ లేక సప్లై చేయటంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. అదేవిధంగా మేడిపల్లి, చిన్నతుండ్ల తదితర గ్రామాల్లో వాటర్ సమస్యలు చాలా ఉన్నాయనీ, ఈ విషయంపై మిషన్ భగీరథ అధికారులు స్పందించి వెంటనే సమస్యలు పరిష్క రించాలన్నారు. సరైన సమయంలో గ్రామాలకు తాగు నీరు అందుతుందా లేదా అన్న విషయాన్ని అధికారులు ఎప్పటి కప్పుడూ పర్యవేక్షణ చేయాలని ఎంపీపీ తెలిపారు. మండల పరిధిలోని గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా మిషన్ భగీరథ అధికారులు పనిచేయాలని ఎంపీపీ వెల్లడించారు. మాలు గ్రామంలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంకర్లు లేక పోవడంతో సప్లైలో సమస్యలు ఏర్పడుతున్నాయని ఎంపీపీ గుర్తు చేశారు. మిషన్ భగీరథ అధికారులు మాల్ కేంద్రంపైన దృష్టిసారించి వాటర్ సమస్యలు పరిష్కరించాలని అధికారులను కోరారు.