Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే, జడ్పీటీసీకి వినతిపత్రం అందజేత : తండా వాసులు
నవతెలంగాణ-మాడ్గుల
కొన్నేండ్లుగా రోడ్డు సౌకర్యం లేక నానా అవస్థలు పడుతున్నామని రోడ్డు సమస్య పరిష్కరించాలని కోరుతూ మండలంలోని కలకొండ గ్రామ పంచాయతీ పరిధిలోని సీతారాం తండా, శనిగలగుట్ట తండా వాసులు సోమవారం ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, జడ్పీటీసీ గౌరవరం ప్రభాకర్ రెడ్డికి, గ్రామ సర్పంచ్ గొర్రె రవీందర్ రెడ్డితో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ తండాలకు సరైన రోడ్డు, రవాణా సౌకర్యం లేక పోవడంతో నిత్యం రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నామని వాపోయారు. దశాబ్దాల కాలంగా గిరి జనులు ఎదుర్కొంటున ఈ సమస్యను పరిష్కరించి ఇబ్బందులు తీర్చాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా తండా వాసులు, వార్డు సభ్యులు రాంచందర్, కలకొండ కాంగ్రెస్ నాయకులు గొర్రె లక్ష్మి నర్సింహ్మ రెడ్డి, గ్రామ యువకులు పులి కష్ణ, నక్కెర కంటి శ్రీను, రామ్ రెడ్డి, మల్లేష్ ,సుమన్, నాగిళ్ల కొండల్, నరేందర్, ఈశ్వర్, అంజి, శంకరయ్య, సక్రు పాల్గొన్నారు.