Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంచాల
ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమ వారం మండల పరిధి నోముల గ్రామ సమీ పంలో సాగర్ హైవే సమీపంలో జేబీ వెంచర్ పరిసర ప్రాంతంలో యువకుడి మృత దేహం లభ్యమైనట్టు సీఐ వెంకటేశం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం అప్పలరాజు (25) తండ్రి సొంరాజు, నెల్లూరు జిల్లా అనంత సాగరం మండలం, సొమాశీల గ్రామం. వీరు గత ఆరేండ్ల క్రితమే హైదరాబాద్కు బతుకుదెరువు కోసం వచ్చారు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక యువకుడు చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరానానికి పాల్పడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్టు సీఐ వెంకటేశం తెలిపారు.