Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-షాబాద్
అప్పుల బాధతో పురుగుల మందుతాగి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన షాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసు కుంది. షాబాద్ పోలీస్ ఇన్స్పెక్టర్ అశోక్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని కుమ్మరి గూడ గ్రామానికి చెందిన నడిమింటి చిన్నయ్య(32) అప్పులు ఎక్కువగా కావడంతో భార్య సుజాతతో చెప్పుకుని బాధపడేవాడు. ఆదివారం ఉదయం చిన్నయ్య పురుగుల మందుతాగి వచ్చి ఇంట్లో కుర్చిలో కూర్చున్నాడు. మందు వాసన వస్తుండడంతో ఏమి తాగావని అడుగగా.. తాను పురుగల మందుతాగానని చెప్పాడు. దీంతో ఇంటి పక్కవారితో కలిసి చికిత్స నిమిత్తం షాబాద్నగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా, అక్కడి వైద్యులు పరీక్షించి, అప్పటికే చిన్నయ్య మృతి చెందినట్టు నిర్ధారించారు. మృతుని భార్య సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.