Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- షాబాద్ ఎంపీపీ కోట్ల ప్రశాంతిమహేందర్రెడ్డి
నవతెలంగాణ-షాబాద్
కోవిడ్‌ను కలిసికట్టుగా నివారిద్దామని షాబాద్ ఎంపీపీ కోట్ల ప్రశాంతి మహేందర్‌రెడ్డి, రుద్రారం గ్రామ సర్పంచ్ స్వర్ణలతా సతీష్ యాదవ్‌లు అన్నారు. షాబాద్ మండల పరిధిలోని రుద్రారం గ్రామంలో సోమవారం వెల్స్పన్ పౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామస్తులకు కోవిడ్ నియంత్రణకు మాస్కులు, శానిటైజర్లు, క్రిమిసంహారక మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కోవిడ్ నియంత్రణకు అందరూ తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ, ఎప్పటికప్పుడూ శానిటైజర్‌తో చేతులకు రుద్దుకోవాలని కోరారు. సీజనల వ్యాధులు రాకుండా గ్రామస్తులందరూ తమ ఇంటి పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెల్స్పన్ ఫౌండేషన్ సీఎస్ఆర్ సుజాత, ఉప సర్పంచ్ నర్సింహులు, పంచాయతీ కార్యదర్శి ఫసీ, వార్డు సభ్యులు, తదితరులు ఉన్నారు.