Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫస్ట్ ఇయర్ మార్కుల ఆధారంగా సెకండియర్ మార్కులు కేటాయింపు
- ఉమ్మడి జిల్లాలో 66,769 విద్యార్థులు ఉత్తీర్ణత
నవతెలంగాణ-రంగారెడ్డిప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలను సోమవారం విద్యాశాఖ ప్రకటించింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 66,769 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇందులో జనరల్ కోర్సుల్లో 63016 మంది విద్యార్థు ఉత్తీర్ణులు కాగా.. 3753 మంది విద్యార్థులు ఒకేషన్ కోర్సుల్లో ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 32081, బాలురు 34,688 రంగారెడ్డి 58, 637, వికారాబాద్ 8,132 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ మార్కుల ఆధారంగా సెకండియర్ మార్కులు కేటాయించడం జరిగింది. సెకండియర్‌లో ప్రాక్టికల్స్‌కు 100 శాతం మార్కులు కేటాయించగా, ఫెయిల్ అయిన విద్యార్థులకు 35 శాతం మార్కులు వేయడం జరిగింది. మొదటి ఏడాది సంబంధిత సబ్జెక్ట్‌లో వచ్చిన మార్కులే సెకండ్ ఇయర్లో ఇవ్వడం జరిగింది. ప్రాక్టికల్స్‌లో అందరికీ గరిష్ట మార్కులు కేటాయించినప్పటికీ. ఫెయిల్ అయిన సబ్జెక్టులో మాత్రం పాస్ మార్కులు కేటాయించడం జరిగింది.