Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ అమోరు కుమార్
నవతెలంగాణ-రంగారెడ్డిప్రాంతీయప్రతినిధి
భూమి మీద పడిన ప్రతి వర్షపు చుక్కను ఒడిసి పట్టుకొనేందుకు ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ అమారు కుమార్ అధికారులు ఆదేశించారు. సోమవారం కలెక్టర్ తన ఛాంబర్లో జల శక్తి అభియాన్‌పై సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షపు నీటిని సంరక్షించుకోవడం, వర్షపు నీటి ప్రాముఖ్యతను చాటి చెప్పే అంశాలపై ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన తీసుకురావాలని, ఇందుకుగాను గ్రామాలలో ప్రచార కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ పనులకు అన్ని శాఖల ద్వారా ఉపాధి హామీ నిధులు వినియోగించుకునేలా చూడాలన్నారు. వర్షపు నీటి సంరక్షణ గుంటలు, చెక్ డ్యాములు, పాడుపడిన బావుల పూడికతీత, ఎండిపోయిన బోర్ల పునరుద్ధరణ, చెరువు శిఖం భూముల ఆక్రమణలను తొలగించుట, వాన నీటి సంరక్షణ వంటి కార్యక్రమాలను ఈ పథకం కింద చేపట్టవచ్చని ఇందుకుగాను ఆయా శాఖలు వారి శాఖ వారిగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ఫారెస్ట్ బ్లాక్‌ల వద్ద, మామిడి, బతాయి తోటల వద్ద చెక్ డ్యాంలను నిర్మించి వాటికి నీరు అందే విధంగా చర్యలు తీసుకోవాలని డీఆర్డీఏ పీడీని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్డీఏ పీడీ ప్రభాకర్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గీతారెడ్డి , ఉద్యాన శాఖ అధికారి సునంద, ఇరిగేషన్ శాఖ అధికారి బన్సీలాల్ తదితరులు హాజరయ్యారు.