Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కమీషన్లపై కాదు అభివృద్ధిపై దృష్టి పెట్టండి
- అధ్వానంగా మహబూబ్ నగర్- చించోలి రోడ్డు
- కాంగ్రెస్ నాయకులు ఎండి యూసుఫ్, నందారం ప్రశాంత్, కృష్ణంరాజు
నవతెలంగాణ-కొడంగల్
సొంత పనుల కోసమే పట్నం బ్రదర్స్ రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఎండి యూసుఫ్, నందారం ప్రశాంత్, కృష్ణంరాజు ఆరోపించారు. శుక్రవారం పట్టణంలోని ఎంపీ రేవంత్‌రెడ్డి నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కొడంగల్ లో ఎస్సైలు, మిగతా అధికారులు ఎందుకు మారుతున్నారో చెప్పాలన్నారు. డబ్బులు ఇచ్చినా అధికారులు మాత్రమే కొనసాగుతున్నారన్నారు. డబ్బులు ఇవ్వని అధికారులను బదిలీ చేస్తున్నారన్నా రు. టీపీసీసీ పదవి రేవంత్‌రెడ్డి డబ్బులు ఇచ్చి కొన్నా రని ఆరోపించడం సరైంది కాదన్నారు. మహేం దర్‌రెడ్డి ఎమ్మెల్సీ టికెట్, నరేందర్‌రెడ్డి ఎమ్మెల్యే టికెట్ ఎంతకు కొన్నారో చెప్పాలన్నారు. కొడంగల్, కోస్గి మున్సిపాలిటీల్లో పదిహేను కోట్ల నిధులు ఉన్న ఒక్కరోజైనా కౌన్సిలర్లను కూర్చోబెట్టి ఏ వార్డులో ఏ స మస్య ఉన్నాయో సమావేశం నిర్వహించి ఏ కౌన్సిలర్ని అయినా అడిగారా అని ప్రశ్నించారు. సొంత పనుల కోసమే పనిచేస్తున్నారని అన్నారు. తమకు నచ్చిన వారికి కాంట్రాక్టులు ఇస్తున్నారని ఆరోపించారు. స్థానిక కాంట్రాక్టర్ ఎవరైనా పని చేస్తున్నారా అన్నారు. చెక్ డ్యామ్‌లు, క్రషర్ మిషన్లలో, ఇసుక, ఇలాంటి వాటిల్లో ఎమ్మెల్యే భాగస్వామ్యం లేకుండా ఏ పని జరగడం లేదన్నారు. వార్డ్ మెంబర్ చేసే పనులు కూ డా ఎమ్మెల్యే చేస్తున్నాడని అన్నారు, మహబూబ్‌నగర్, చించోల్ రోడ్డు టీడీపీ అధికారంలో ఉండగా మహబూబ్‌నగర్ అతిథిగృహంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి రేవంత్ రెడ్డి మెమోరండం అందిస్తేనే రెండు రోడ్లు ఒకసారి కొడంగల్‌కు ఇవ్వకుండా మహబూబ్ నగర్, చించోల్ రోడ్డు ఆపి ఇప్పుడు ఇచ్చారన్నారు. మెడికల్ కళాశాల మహేందర్ రెడ్డికి రాలేదని కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్నారు. ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి కూడా ఎన్ని రోజులు టీఆర్ఎస్లో ఉంటారో ఆలోచిం చాలన్నారు. సొంత పనుల కోసమే మహేందర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డిలు రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఆనంద్‌రెడ్డి, రేవంత్ మిత్రమండలి నాయకులు దాము, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.