Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్పంచ్ కె.రాజిరెడ్డి
నవతెలంగాణ-దోమ
గ్రామంలో పరిశుభ్రతే ప్రధాన అంశంగా పనులు జరుగుతున్నాయని దోమ సర్పంచ్ కె. రాజిరెడ్డి అన్నారు. శుక్రవారం దోమ గ్రామ పంచాయతీలో అంగన్వాడీ ఆశకార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఇంటికి ఆరు మొక్కలు పంపిణీ చేయాలన్నారు. మురుగు కాలువల నిర్వహణపై దృష్టి సారించాలన్నారు. దోమకు అనుబంధ గ్రామమైన ఉదనరావు పల్లిలో రోడ్డుకు ఇరువైపులా అక్రమించిన స్థానాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్, వార్డు సభ్యులు నవీన్, చెన్నమ్మ, గ్రామస్తులు పాల్గొన్నారు.