Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టణప్రగతిపై వార్డుల్లో ముందుగా సమావేశం నిర్వహించాలని డిమాండ్
నవతెలంగాణ-తాండూరు
పట్టణ ప్రగతిపై ముందుగా వార్డుల్లో నెలకొన్న సమస్యలపై మున్సిపల్ కౌన్సిలర్లతో సమీక్షా సమావేశం నిర్వహించాలని కోరుతూ శుక్రవారం తాండూర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ప్రతిపక్ష కౌన్సిలర్లు ఆందోళన చేపట్టారు. బీజేపీ, టీజేఎస్ కాంగ్రెస్ పార్టీల కౌన్సిలర్లు నిరసన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించే వరకు మున్సిపల్ కార్యాలయం నుంచి జరిగేది లేదని భీష్మించి కూర్చున్నారు. తాండూరు మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమం లోపై తాండూరు మున్సిపల్ కార్యాలయంలో వార్డుల సమస్యలపై ముందుగా సమావేశం నిర్వహించి ఆ తర్వాత వార్డుల్లో పట్టణ ప్రగతి పనులను కొనసాగించాలని ప్రతిపక్షాలు కౌన్సిలర్లు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సమస్యలు అలాగే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో లాగా జరగకుండా ఉండాలంటే ముందుగా కౌన్సిలర్లతో స్పెషల్ ఆఫీసర్, కమిషనర్, మున్సిపల్ చైర్మన్ సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శ్రీనివాసరెడ్డి, సోమశేఖర్, సౌత్ శ్రీలత, లలిత వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.