Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పరిగి
నిరుపేదలకు కొండంత అండ ముఖ్యమంత్రి సహాయ నిధి అని ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నా రు. శుక్రవారం పరిగి పట్టణ పట్టణ కేంద్రంలోని ఆయన నివాసంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్దిదా రులకు అందజేశారు. పరిగి నియోజకవర్గ పరిధిలోని వివి ధ గ్రామాలకు చెందిన 79 మంది ఇటీవలే అనారోగ్యంతో చికిత్స చేయించుకున్నారు. వారందరికీ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా, ముగ్గురికి ఎల్వోసీ ద్వారా మొత్తం 48,63,000 రూపాయలు మంజూరు చేయించి ఎమ్మెల్యే వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ ముకుంద అశోక్, ఎంపీపీ అరవిందరావు, జడ్పీటీసీ హరి ప్రియప్రవీణ్ కుమార్ రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు ఆంజనేయులు, పార్టీ సీనియర్ నాయకులు ప్రవీణ్ కుమా ర్ రెడ్డి, సురేందర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.