Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదనపు కలెక్టర్ చంద్రయ్య
నవతెలంగాణ-పరిగి
పట్టణ ప్రగతి ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య అన్నారు. శుక్రవారం పరిగి మున్సిపల్ పరిధిలో గల మూడో వార్డు, పదిహేనవ వార్డులలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా చేపడుతున్న పట్టణ ప్రగతి - హరితహారం కార్యక్రమాన్ని పరిగి మున్సిపల్ చైర్మెన్ ముకుంద అశోక్ కుమార్తో కలిసి జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పనులన్నీ పకడ్బం దీగా చేపట్టాలని సూచించారు. మురుగు కాలువలు శుభ్రం చేయుట, గుంతలను పుడుచుట, పైపులైన్లు సరిచే యటం గురించి ఆయా కాలనీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని పరిరక్షించే బాధ్యతను చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ప్రవీణ్ కుమార్, కౌన్సిలర్స్ వేముల కిరణ్,మునీర్, స్పెషల్ ఆఫీసర్స్ చంద్రకళ, వేణు నాయకులు, నరేష్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.