Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెదవీడు గ్రామసభలో ఎమ్మెల్యే కాలె యాదయ్య
నవతెలంగాణ-షాబాద్
పరిహారం ప్రభుత్వ నిబందనల ప్రకారం చెల్లిస్తామని చేవెళ్ల ఎమ్మెల్యేకాలె యాదయ్య అన్నారు. శుక్రవారం షాబాద్ మండల పరిధిలోని పెదవీడు గ్రామంలో కంపెనీలకు భూములు ఇచ్చే విషయంపై రైతులతో గ్రామసభను నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. రైతులకు ఎకరాకు రూ.40 లక్షల పరిహారం చెల్లించాలని తెలిపారు. 20 ఎకరాల్లోని భూమిలో గ్రామ అవసరాల నిమిత్తం నిరుపేదలకు డబుల్ బెడ్రూంలు ఇండ్లు కట్టి ఇవ్వాలన్నారు. గ్రామంలోని సీసీరోడ్లు, అండర్డ్రయినేజీ, నూతన గ్రామపంచాయతీ, మహిళా భవనం, యూత్భవనం నిర్మించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వేనంబర్ 147లో ఉన్న102 ఎకరాల 7గుంటల భూములను టీఎస్ఐసీసీకీ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దీంతో గ్రామంలోని యువతకు ఉద్యోగాలతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ప్రభుత్వ విలువ ప్రకారం మూడు వంతులకు ఎక్కువగా ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుందని తెలిపారు. పక్కనే ఉన్న చందన్‌వెళ్లి, హైతాబాద్‌లో పరిశ్రమలు ఏర్పాటు కావడంతో అక్కడ అభివృద్ధి చెందుతున్నాయన్నారు. ఇక్కడ కూడా కంపెనీలు ఏర్పాటు అయితే యువతకు ఉద్యోగాలు, లభిస్తాయని చెప్పారు. రైతుల తరపున ఉన్న సీఎం కేసీఆర్ పలు అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోట్ల ప్రశాంతి మహేందర్‌రెడ్డి, జడ్పీటీసీ అవినాష్‌రెడ్డి, ఆర్డీవో వేణుమాధవ్, తహసీల్దార్ అమర లింగంగౌడ్, సర్దార్‌నగర్ మార్కెట్ కమిటీ చైర్మెన్ స్వప్ననర్సింహ్మారెడ్డి, డీప్యూటీ తహస ీల్దార్ కార్తిక్‌రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ మహేందర్‌గౌడ్, గ్రామ సర్పంచ్ శ్రీనివాస్‌గౌడ్, ఎంపీటీసీ జయమ్మవెంకట్‌రెడ్డి, గ్రామస్థులు తదితరులు ఉన్నారు.