Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-యాచారం
మానసిక ప్రశాంతతకు ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను పెంపొందించుకోవాలని హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి సూచించారు. శుక్రవారం యాచారం మండల పరిధిలోని తక్కల్లపల్లి తండాలో అంగోత్ జంగు, రామదాసు ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీ శ్రీ బంగారు మైసమ్మ ఆలయాన్ని విద్యారణ్య భారతి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరేస్టార్ దక్షిణ భారతదేశ పర్వతారోహకులు అంగోత్ తుకారాం తల్లిదండ్రులు ఈ ఆలయాన్ని నిర్మించడం అభినందిం చాల్సిన విషయమన్నారు. ఈ ప్రారంభోత్సవానికి దేశం, రాష్ట్ర నలుమూలల నుంచి ప్రముఖులు హాజరు కావడం సంతోషకరమైన విషయమని విద్యారణ్య భారతి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రామదూత సంస్థాన్ బంజా రా అధిపతులు, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి, ఐఏఎస్ తేజావత్ రామచంద్రుడు, తెలంగాణ కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంధం కర్ణాకర్ నాయుడు, బీజేపీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు సుధాకర్ రావు, అంగోత్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.