Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ చైర్మన్ కాంటేకార్ మధుమోహన్
నవతెలంగాణ-మహేశ్వరం
పల్లె, పట్టణ ప్రగతికి ప్రతి ఒక్కరూ సహకరించాలని తుక్కుగూడ మున్సిపల్ చైర్మన్ కాంటెకార్ మధుమోహన్ అన్నారు. శుక్రవారం రెండో వార్డులో పట్టణ ప్రగతిపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తుక్కుగూడ మున్సిపల్లోని ప్రతి వార్డులో హరితహారం మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టాలని, మున్సిపల్‌ను పచ్చదనంతో ఉండాలని తెలుపుతూ, ప్రతి ఇంటికి ఆరు మొక్కలు నాటాలని సూచించారు. తుక్కుగూడ రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. తుక్కుగూడ పురపాలక సంఘంలో అన్ని వార్డుల్లో పట్టణ ప్రగతి కార్యక్రమాలు మొదలు పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ జ్ఞానేశ్వర్, మేనేజర్ పర్వతాలు, ఏఈ గోపి, స్థానిక కౌన్సిలర్లు, మహిళలు పాల్గొన్నారు.