Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాన్‌వెస్లీ
నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి
ప్రజా సమస్యలు పరిష్కారించడంలో కేంద్రం పూర్తిగా విఫలం అయిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాన్‌వెస్లీ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో సీపీఐ(ఎం) నాయకులు వెంకటయ్య ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జాన్‌వెస్లీ హాజరై మాట్లాడుతూ నిరుద్యోగుల సమస్య తీవ్రంగా ఉందన్నారు. డిగ్రీలు, ఇంజనీర్లు చదివి ఉపాధి కోసం చూస్తున్నారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉపాధి కల్పించాలన్నారు. దళితులను అవమానిస్తున్నారని అన్నారు. వికారాబాద్‌కు గతంలో మెడికల్ కాలేజీ ఇస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ ఆ హామీని నిలుపుకోలేదన్నారు. జిల్లాకేంద్రంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రుల్లో ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో రవాణా సౌకర్యం మెరుగు పరచాలని కోరారు. భూ సమస్యలు పరిష్కారించాలన్నారు. రైతులకు పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.