Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
వర్షాలకు దెబ్బతిని కొంతకాలంగా మరమ్మతులకు నోచుకోని రోడ్ల పునర్నిర్మాణానికి పనులకు రూ.13.45 కోట్ల నిధులు మంజూరైనట్టు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ఈ నిధులతో నియోజకవర్గంలోని పాడైన రోడ్లను పునరుద్ధరించనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నియోజకవర్గంలోని రోడ్లు అన్నింటిని అభివద్ధి చేసుకోగలిగే అవకాశం ఏర్పడిందన్నారు. గత సంవత్సరం కురిసిన భారీ వర్షాలకు నాగార్జునసాగర్ ప్రధాన రహదారి సహా కొన్ని రోడ్ల అక్కడక్కడ దెబ్బతినడంతో వాటిని మరమ్మతులకు ప్రభుత్వానికి ప్రతిపాదించినట్టు తెలిపారు. నాగార్జున సాగర్ రహదారిని బొంగ్లూర్ నుంచి ఇబ్రహీంపట్నం వరకు రూ.2.85 కోట్లు, ఇబ్రహీంపట్నం నుంచి మాల్ వరకు రూ.1.40 కోట్లు, దండుమైలారం రోడు వంతెనల నిర్మాణానికి రూ.2.40కోట్లు, పోచారం-ఎలిమినేడు రోడ్డుకు రూ.80 లక్షలు కేటాయించినట్లు వివరించారు. ఈ పనులను వెంటనే ప్రారంబిస్తామన్నారు. అనాజ్‌పూర్ నుంచి గుంతపల్లి మీదుగా మజీద్‌పూర్ వరకు రూ.85 లక్షలు, కుత్బుల్లాపూర్- గౌరెల్లి రోడ్డుకు రూ.75 లక్షలు, చిత్తాపూర్, తాళ్లపల్లిగూడా రోడ్డుకు రూ.30 లక్షలు, ఆరుట్ల మంచాల రోడ్డుకు రూ.50 లక్షలు, మంచాల నుంచి జాపాల మీదుగా, ఆగాపల్లి వరకు రూ.40 లక్షలు, రంగాపూర్ వెంకటేశ్వర తండా రోడ్డుకు రూ.20 లక్షలు, పోల్కంపల్లి, నెర్రపల్లి మీదుగా దండుమైలారం రోడ్డుకు రూ.85 లక్షలు, ఎలిమినేడు, పెద్దతుండ్ల రోడ్డుకు రూ.60లక్షలు, పెద్దతుండ్ల, చింతల రోడ్డుకు రూ.42లక్షలు, యాచారం, చౌదర్పల్లి, చింతల రోడ్డుకు రూ.85 లక్షలు, రాయపోల్ నుండి మన్నెగూడ రోడ్డుకు రూ.28 లక్షలు చొప్పున కేటాయించినట్లు ఎమ్మెల్యే వివరించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తు వెంకట రమణారెడ్డి, ఎంపీపీ కృపేష్, నర్మద, జెడ్పీటీసీ జంగమ్మ ఉన్నారు.