Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర విద్యాశాఖమంత్రి పి.సబితాఇంద్రారెడ్డి
నవతెలంగాణ-మహేశ్వరం
ప్రజల సంపుర్ణ సహకారంతో తుక్కుగూడ పురపాలక సంఘం శరవేగంగా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత కల్పించి పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేస్తుందని అందులో భాగంగా తుక్కుగూడ పురపాలక సంఘంలో సమీకృత మార్కెట్ నిర్మాణానికి నాలుగున్నర కోట్లు మంజూరు చేసినట్టు మహేశ్వరం ఎమ్మెల్యే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం తుక్కుగూడ పురపాలక సంఘంలోని పలువార్డుల్లో పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో పాల్గొని సీసీరోడ్డు అండర్ డ్రయినేజీ పనులు మంచినీటి పైసులైన్ల పనులకు శంకుస్థాపనలు చేశారు. హరిహాతరంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ డంపింగ్‌యార్డు వైకుంఠధామాల కోసం కోట్లది నిధులు కేటాయించి స్వచ్ఛత పారిశుధ్యంపై దృష్టి కేంద్రికరించినట్టు వివరించారు. కార్యక్రమంలో పురపాలక సంఘం చైర్మన్ కాంటేకార్ మధుమోహన్ వైస్‌చైర్మన్ భవానివెంకట్రెడ్డి, కౌన్సిలర్లు బి.హేమలత బి.రవినాయక్ జె.భావన ఎస్ లావణ్యరాజు ఆర్. రాజు, వై. శివకుమార్ బి.తేజస్వీని ఆర్. సుమన్ కె.పద్మశివయ్య ఆర్. మౌనిక బి.విలాస్, కమిషనర్ జ్ఞానేశ్వర్, ఎఇ భార్గవ్, డిఇ యాదయ్య, యు.శ్రీనివాస్, నర్సింహ్మరెడ్డి, పి.సురేష్, చంద్రశేఖర్, జి.లక్ష్మయ్య, బాటసురేష్ ఎం,శేఖర్‌రెడ్డి, సింహరెడ్డి, నర్సింగ్‌గౌడ్, శ్రీలత, రజని, శ్రీధర్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు.