Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి
నవతెలంగాణ-పరిగి
పట్టణాల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని తీసుకువచ్చారని ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డి అన్నారు. ఆదివారం పరిగి మున్సి పల్ పరిధిలో మూడవ విడత పట్టణ ప్రగతి - హరి తహారంలో భాగంగా మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్‌కుమార్‌తో కలిసి స్థానిక 9వ వార్డులో పర్యటిం చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వార్డుల్లో పురాతన, శిధిలావస్థలో ఉన్నటువంటి ఇండ్ల ను కూల్చివేయాలని అధికారులకు సూచించారు. ఎల క్ట్రిక్ స్తంభాలను తొలగించడం, లూజుగా ఉన్న వైర్లను సరిచేయాలని అన్నారు. ఎవ్వరు కూడా చెత్తను పడ కూడదని సూచించారు. ఇంట్లోనే తడి చెత్త, పొడిచెత్త వేరుచేసి కాలనీలకు వచ్చిన చెత్త వాహనాల్లో వేయాలని సూచించారు. పిచ్చి మొక్కలను తొలగించి రోడ్లపక్కన మొక్కలను నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ హరిప్రియప్రవీణ్రెడ్డి, ఎంపీపీ అరవిందరావు, మండలాధ్యక్షులు ఆంజనేయు లు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్యాంసుందర్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, సురేందర్, జిల్లా కో-ఆప్షన్ సభ్యులు హఫీజ్, వార్డు కౌన్సిలర్స్ శబ్బనూర్ రియాజ్, వేముల కిరణ్, మునీర్, బి. రవికుమార్, ఎర్రగడ్డ పల్లి కృష్ణ, ఆయా కాలనీ స్పెషల్ ఆఫీసర్లు మహేష్, వేణు, ఖాదిర్, నాయకులు నరేష్ యాదవ్, దోమ శ్రీశైలం, బాల్నగర్ బాబయ్య, యాదయ్య, రాజు, ఆనంద్, ఆయా కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
పరిగి మున్సిపల్ పరిధిలోని ఒకటో వార్డులో మూడవ విడత పట్టణ ప్రగతి ప్రణాళిక, హరితహారం లో భాగంగా నాలుగవ రోజు ఇంటింటికి చెత్త వేరు చేయుట, పొదలను తొలగించుట కార్యక్రమాన్ని కౌన్సిలర్ వాసియా తబస్సుమ్ మౌలానా ప్రారంభిం చారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్స్, ఆర్పీలు, ఆశావర్కర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పరిగి మున్సిపల్ పరిధిలోని 10వ వార్డులో మూడవ విడత పట్టణ ప్రగతి, హరితహారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్ మురుగునీటి కాలువలు శుభ్రం చేయించారు.