Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దోమ
మండల పరిధిలోని తిమ్మాయిపల్లి తండా శివారులో రైతు వార్ల కౌశిక్ కు ఎనిమిది ఎకరాల పొలం ఉంది. ఎనిమిది ఎకరాలకు గాను మూడు బోర్ బావిలు తోవ్వించి, బోర్ మోటార్‌ను ఏర్పాటు చేసి వరి సాగు చేసే వాడు. ప్రస్తుతం నారుమడి చల్లేందుకు బోర్ మోటార్ సహాయంలో పొలంలో నీరు వదలడానికి రైతు కౌశిక్ పొ లానికి వచ్చి బోర్ మోటార్ స్టార్ట్ చేయగా బోర్ మోటార్ నడవకపోవడంతో బోర్ బావి వద్దకు వచ్చి మోటార్‌ను పరిశీలించారు. బోర్ బావిలో దాదాపుగా చాలా లోతు వరకు చిన్న, చిన్న రాళ్లతో నిండి ఉంది. పొలానికి సరఫ రా చేసే అన్ని బోర్ బావిల పరిస్థితి ఇలాగానే ఉందని రైతు కౌశిక్ వాపోయాడు. గుర్తు తెలియని వ్యక్తులు బోర్ బావిలో మొత్తం చిన్న, చిన్న రాళ్లతో నింపాడంతో రైతు దిక్కు తోచని స్థితిలో ఉన్నాడు. అనంతరం బోర్ మెకానిక్ సహాయంతో బోర్ మోటార్ తీయడానికి ప్రయత్నించగా మూడు బోర్ మోటార్లు పైపులతో సైతం ఉడిపోయాయని తెలిపారు. అన్నం పెట్టె రైతన్నకు ఎన్ని కష్టాలని కన్నీటి పర్యంతం అయ్యాడు.