Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తాండూరు రూరల్
గ్రామ స్వచ్ఛతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోటాబాస్పల్లి గ్రామ సర్పంచ్ నాగార్జున అన్నారు. ఆదివారం మహిళలకు తడి, పొడి చెత్త వేరు చేసేందు కు చెత్త బుట్టలను పంపిణీ చేశారు. అనంతరం పల్లె ప్రగతిలో భాగంగా శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు. ఆ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాల న్నారు. అప్పుడే వ్యాధుల బారిన పడకుండా ఉంటామన్నారు. తడి, పొడి చెత్తను వేరువేరు గా ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి లాలప్ప, సొసైటీ డైరెక్టర్ సురేందర్‌రెడ్డి, వెంకట్ రాంరెడ్డి, వార్డు మెంబర్లు, పంచాయతీ పారిశుధ్య కార్మికులు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.