Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోట్‌పల్లి
వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యంలో లబ్దిదారులకు ఎమ్మెల్యే మెతకు ఆనంద్ చెక్కులు పంపిణీ చేశారు. బంట్వారం మండల పరిధిలోని నాగారం గ్రామానికి చెందిన బండి శేఖర్, కు(2,00,000 )రెండు లక్షల రూపాయలు, రొంపల్లి గ్రామానికి చెంది న భోయిని నాగప్పకు 27500 రూపాయలు, బొపునారం గ్రామానికి చెందిన రాములుకు 12000 రూపాయలు, మొత్తం (239500 ) రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందించినట్టు టీఆర్ఎస్ బంట్వారం మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మెన్ మల్లేశం, పీఏసీఎస్ వైస్ చెర్మెన్ సుధాకర్ గౌడ్, రైతుబంధు అధ్యక్షుడు కాజా పాష, నాయకులు శరణరెడ్డి, చందు సింగ్, నాగరాజు, రాజు, అంజి, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.