Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ మండల అధ్యక్షులు అయ్యగాల్ల భీమయ్య
నవతెలంగాణ- యాలాల
నూతనంగా ఎంపికైన టీపీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్‌రెడ్డిపై తాండూరు ఎమ్మెల్యే, పైలట్ రోహిత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని కాం గ్రెస్ మండలాధ్యక్షుడు ఎ. బీమయ్య అన్నారు. ఆదివారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి గత ఎన్నికల్లో కాంగ్రెస్ బీఫాంతో గెలిచారని గుర్తు చేశారు. హస్తం గుర్తుతో గెలిచి మళ్లీ కాంగ్రెస్ నేతలపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రేవంత్‌రెడ్డిపై తీవ్రమైన పదజాలంతో, వ్యక్తిగ తంగా అసభ్యకరంగా ఆరోపణలు చేయడం మంచిది కాద న్నారు. తాండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, చెమటోడ్చి, పట్టుదలతో రోహిత్ రెడ్డిని ఎమ్మె ల్యేగా గెలిపించారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని వీడి, టీఆ ర్ఎస్ పార్టీలో చేరి నియోజకవర్గానికి ప్రభుత్వం నుంచి ఎన్ని కోట్ల నిధులు రాబట్టారో శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీ నామా చేసి, టీఆర్ఎస్ గుర్తుపై పోటీ చేసి మళ్లీ గెలవాలని ఆయన సవాల్ విసిరారు. రోహిత్ రెడ్డి గెలుపు కోసం ప్రాణాలకు తెగించి పని చేశామని ఆవేదన చెందారు. మా జీ మంత్రులు, మాణిక్ రావ్, చంద్రశేఖర్, నారాయణ రావు హయాంలోనే తాండూరు నియోజకవర్గం చాలా అభివృద్ధి చెందిందని ఆయన గుర్తు చేశారు. ఈ సమావేశంలో కమా ల్పూర్ సర్పంచ్ బస్వరాజ్, చెన్నారం సర్పంచ్ సాయిలు, నాయకులు మల్లప్ప, అమృతయ్య, బస్వరాజ్, రాంచెందర్ పాల్గొన్నారు.