Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇటివలె మంత్రి, ఎమ్మెల్యేలతో శంకుస్థాపన
- యథేచ్ఛగా కబ్జాకు సిద్ధం
నవతెలంగాణ-మొయినాబాద్
ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండల పరిధిలోని చిలుకూరు రెవెన్యూ సర్వే నంబర్ 277 ప్రభుత్వ భూమిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మా ణానికి శంకుస్థాపన చేశారు. అయితే కొందరు కబ్జాదా రులు అదే ప్రభుత్వ స్థలాన్ని కాజేసేందుకు అక్రమ నిర్మా ణాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా నిర్మాణ సా మాగ్రిని ఏర్పాటు చేసి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. సాక్షాత్తూ రాష్ట్ర మంత్రి ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిం చడంపై పలువురు స్థానిక ప్రజా ప్రతినిధులతో పాటు రె వెన్యూ అధికారుల తీరుపై మండల ప్రజలు ఆగ్ర హం వ్య క్తం చేస్తున్నారు. ఇదే ప్రభుత్వ భూమి విషయం లో గతం లో కేసు నమోదు అయినప్పటికీ అప్పట్లో సీఐగా విధులు నిర్వహించిన ఓ మహిళా సీఐ, మొయినాబాద్ సీఐ కొంద రు అక్రమార్కులు పేర్లను తొలగించేందుకు అక్రమార్కుల నుంచి ఇదే సర్వే నంబర్లో దాదాపు 200 గజాల స్థలాన్ని పొందినట్టు సమాచారం. 200 గజాల స్థలాన్ని పొందగా కేసును రద్దు చేసినట్టు తెలిసింది. ఇదే విషయంపై స్థానిక ఎమ్మెల్యేకు తెలియగా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న సీఐకి అదే కేసును మళ్లీ ఓపెన్ చేసి కబ్జా చేసే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు తెలిసింది.