Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చేతి వత్తిదారుల సమన్వయ కమిటీ
- రాష్ట్ర కో-కన్వినర్ లెల్లెల బాలకష్ణ
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలిఅమర వీరులు దొడ్డి కొమరయ్య ఆశయసాధనకు కృషి చేస్తామని చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర కో-కన్వినర్ లెల్లెల బాలకృష్ణ అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు తొలి అమరుడు దొడ్డికొమరయ్య 75 వర్ధంతిని పురష్కరించుకుని ఇబ్రహీంపట్నంలోని అంబేద్కర్ విగహ్రం వద్ద చేతి వత్తిదారుల సమన్వయ కమిటీ అధ్వర్యంలో ఆధ్వర్యఒలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడుతూ.. రాజకార్లఆగడాలు, పటెల్ పట్వారీల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో అనేక వేలాది మంది వృత్తిదారులు వెట్టిచాకిరికి వ్యతిరేకంగా, భూమి, భుక్తి, విముక్తి, ఆత్మగౌరవం కోసం ఉద్యమించారన్నారు. ఆ పోరాటంలో దొడ్డి కొమరయ్య తొలి అమరుడయ్యారని చెప్పారు. తెలంగాణ రాష్టంల్రో వత్తిదారులు అంటే కేవలం గోర్లు బర్లు, చేపలిస్తున్నామని చెప్పుకోవడమే కాదని, ఎంగిలి మెతుకులు మాత్రమే ఇస్తున్నట్లుగా ఉందని విమర్శించారు. కానీ ఉద్యోగ, ఉపాధి కల్పించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ తరుణంలో దొడ్డికొమరయ్య స్పూర్తితో రాష్ట్రవ్యాప్తంగా వృత్తి దారుల సమస్యలపై ఆందోళనలు, పోరాటాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వినర్ పి. యాదయ్య, మత్స్య కార్మిక సంఘం జిల్లా పధ్రాన కార్యదర్శి నర్సింహ్మా, అధ్యక్షులు శంకర్, జీఎంపీఎస్ జిల్లా అధ్యక్షులు జంగయ్య, జిల్లా కార్యదర్శి మల్లేష్, అడ్వకేట్ అరుణ్ కుమార్, క్షౌర వృత్తిదారుల రాష్ట్ర అధ్యక్షులు కార్యదర్శులు సుధాకర్, చెన్నారం మల్లేష్, వడ్డెర వత్తిదారుల సంఘం రాష్ట్రనాయకులు వీగేష్, బడుగు శంకరయ్య, చేనేత కార్మిక సంఘం రాష్ట్రకార్యదర్శి, రజక వృత్తి దారుల సంఘం జిల్లా నాయకులు సి.వెంకటేష్ కుమ్మరిసంఘం జిల్లా అధ్యక్షులు శంకర్,దశరథ,ఎకలవ్య సంఘం సుదర్శన్ విశ్వకర్మ వృత్తి దారుల రాష్ట్ర నాయకులు యాదగిరిచారి, శెకర్ చారి, ఉదరు కుమార్ తదితరులు పాల్గొన్నారు.