Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్
- తాండూరులో యువజన కాంగ్రెస్ నాయకుల అరెస్ట్
నవతెలంగాణ-తాండూరు
రాష్ట్రంలో టీఆర్ఎస్కు దమ్ముంటే 12 మంది కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి మళ్లీ ఎన్నికల్లో గెలిపించుకోవాలని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు, మున్సిపల్ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ అన్నారు. ఆదివారం తాండూరు పట్టణ కేంద్రంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ పిలుపు మేరకు యువజన కాంగ్రెస్ నియోజకవర్గం ఉపాధ్యక్షుడు మోహిన్అహ్మద్, జనరల్ సెక్రటరీ కావాలి సంతోష్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి అలాగే పైలెట్ రోహిత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఎమ్మెల్యేల దిష్టిబొమ్మ దహనం చేస్తుండగా అడ్డుకొని యువజన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ నుంచి గెలుపొందిన 12 మంది ఎమ్మెల్యేలకు డబ్బులను ఆశ చూపి లొంగ తీసుకున్నారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ నాయకులకు దమ్ముంటే ఆ 12 మంది ఎమ్మెల్యేలను వెంటనే రాజీనామా చేయించి తిరిగి ఎన్నికల్లో నిలబడి గెలిపించుకోవాలని సవాల్ విసిరారు.కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రభాకర్ గౌడ్, మాజీ కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ లింగదల్లి రవికుమార్, నాయకులు నవాజ్, రఘునందన్, ఖయుమ్ , బలరాం, అంబదాస్, సురేష్, జెలల్ ,సమద్,రియాజ్, ఎబినేజర్, తదితరులు పాల్గొన్నారు.