Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- మాడుగుల పీహెచ్సీలో అంబులెన్స్, 10 పడకల ప్రసూతి వార్డు ప్రారంభం
- జర్పులతండాలో శ్మశానవాటిక..
నవతెలంగాణ-మాడ్గుల
ప్రభుత్వం చేపట్టే ప్రజా సక్షేమంలో భాగస్వామ్యం అవుతూ సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం అని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. పేదలను ఆదుకోవడంలో దాతలు ముందుకు రావడం గొప్ప శుభ పరిణామమని అన్నారు. మాడుగుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మండల కేంద్రానికి చెందిన సూదిని పట్టాభిరామిరెడ్డి, వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఏర్పాటుచేసిన అంబులెన్స్, పది పడకల ప్రసూతి వార్డును స్థానిక ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, జడ్పీ చైర్మన్ అనితాహరినాథ్‌రెడ్డి, ఎంపీపీ పద్మారెడ్డి, జడ్పీటీసీ గౌరవరం ప్రభాకర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బట్టు కిషన్‌రెడ్డి, నాయకులు యాచారం వెంకటేశ్వర్లు గౌడ్, కొత్త పాండు గౌడ్, జైపాల్ రెడ్డి, దాత పట్టాభిరామ్రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం మాడుగుల సర్పంచ్ అంబాల జంగయ్య గౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నదన్నారు. రాష్ట్ర అభివద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. అంతకు ముందు జర్పులతండాలో శ్మశాన వాటికను ప్రారంభించారు.
జర్పులతండాలో పల్లె ప్రకతి వనం బెస్ట్
జర్పుల తండా గ్రామ పంచాయతీలో ఏర్పాటుచేసిన పల్లె ప్రకతి వనం అద్భుతంగా ఉందని మంత్రి సబితారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వనంలో ఆమె పర్యటించి సర్పంచ్ హీర్‌షా దేవి జైపాల్ నాయక్‌ను అభినందించారు. దాదాపు నాలుగు ఎకరాల్లో పలు రకాల పండ్లు, పూల మొక్కలు పెంచడం పట్ల సర్పంచ్‌ను ప్రత్యేకంగా ప్రశంసించారు. అదేవిధంగా ఆర్కపల్లి, బ్రాహ్మణపల్లి గ్రామాలలో పల్లె ప్రగతి కార్యక్రమాలలో సర్పంచులు ఏర్పుల జంగయ్య పులికంటి లక్ష్మయ్య, పాలకవర్గం గ్రామస్తులతో కలిసి మంత్రి మొక్కలు నాటారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామాల ఉన్న సమస్యలపై ప్రజా ప్రతినిధులు, నాయకులు మంత్రికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీవో వెంకటాచారి, డిప్యూటీ డీఎంహెచ్‌వో నాగజ్యోతి, డాక్టర్ లలిత, పీఏసీఎస్ చైర్మన్ తిరుమల్‌రెడ్డి, కో-ఆప్షన్ సభ్యులు జోజిరెడ్డి, మాజీ ఎంపీపీ జైపాల్ నాయక్, మాజీ జడ్పీటీసీ రవితేజ, ఎంపీటీసీ లక్ష్మి లక్ష్మయ్య, సర్పంచులు అందుగుల జయలక్ష్మి రాజు, ఆదిమల్ల పద్మశ్రీనివాస్, బొజ్జ రమేష్‌రెడ్డి, యాదిరెడ్డి, మండల, డివిజన్, జిల్లాస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.