Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో కొండాపూర్ డివిజన్ యువ నాయకులు ఆదిల్ పటేల్ పాల్గొన్నారు. కొండాపూర్ డివిజన్లోని సిద్దిఖ్నగర్లో ఐదో రోజు పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని, స్థానిక నాయకులతో కలిసి పలు మొక్కలు నాటారు. అనంతరం కరోనా విపత్కర సమయంలో అహర్నిశలు కష్టపడిన జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులకు శాలువాలతో సన్మానం చేసి, స్వీట్లు, బిర్యాని ప్యాకెట్లను పంపిణీ చేశారు. కరోనా కష్టకాలంలో సిద్దిఖ్నగర్లో పనిచేసిన జీహెచ్ఎంసీ సిబ్బంది ఎస్సార్పీ కిరణ్ కుమార్రెడ్డి, ఎస్ఎఫ్ఏ సుదీశ్ లను సన్మాంచి, వారి ప్రశంసించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనా విపత్కర సమయంలో ఎంతో కష్టపడి వీధివీధి, వాడవాడ పరిశుభ్రంగా ఉంచిన ప్రతిఒక్క పారిశుధ్య కార్మికుడికి ప్రత్యేక కతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు గౌరీ, నరసింహ సాగర్, రవిగౌడ్, నందు, గణపతి, సాగర్, యూత్ నాయకులు దీపక్, కరీం, జుబేర్, వెంకటేష్, శానిటేషన్ సూపర్వైజర్ జలంధర్ రెడ్డి, జీహెచ్ఎంసీ ఎస్సార్పీ కిరణ్ కుమార్ రెడ్డి, ఎస్ఎఫ్ఏ సుదీశ్, జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మిక సిబ్బంది పాల్గొన్నారు.