Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉప సర్పంచ్ల సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు బేరీ రామచందర్ యాదవ్
నవతెలంగాణ-తాండూరురూరల్
ఉప సర్పంచ్‌లపై ఒత్తిడిని అరికట్టాలని ఉప సర్పం చ్ల సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు బేరీ రామ చందర్ యాదవ్ కోరారు. సోమవారం తాండూరు అ ధ్యక్షుడు గోవింద్ ఆధ్వర్యంలో ఉప సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లావుడ్యా రాములునాయక్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ తాండూరు మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ షేక్ హాసన్‌ను ఉప సర్పంచ్ పదవి నుంచి తప్పుకోలేకపోతే రాజీనామా చేయి అంటూ స్థానిక సర్పంచ్ ఒత్తిడి తెచ్చినట్టు తెలిపారు. ఇదే విషయాన్ని రాష్ట్ర అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. ఉప సర్పంచ్‌పై ఒత్తిడి తెచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ జిలా ్లలోని ఉప సర్పంచ్ల సంఘం అధ్యక్షులు పాల్గొన్నారు.