Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గనుల తవ్వకాలకు కొత్త మైనింగ్ విధానం
- రాష్ట్ర ఐటీ పరిశ్రమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ లిజయేష్ రంజన్ వెల్లడి
నవతెలంగాణ-పెద్దేముల్
రానున్న మూడేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం 30లక్షల ఎకరాలలో నూనె గింజల పంట ఉత్పత్తి సాగును కొనసాగించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్ స్పష్టం చేశారు. పెద్దేముల్ మండల పరిధిలోని మారేపల్లి సమీపంలో ఉన్న నవ భారతి కెమికల్ సుద్ద పరిశ్రమ 7వ వార్షికోత్సవ వేడుకలు హైదరాబాద్లో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మా ట్లాడుతూ.. గనుల తవ్వకాలకు సంబంధించి కొత్త మైనింగ్ విధానం ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలిపారు. నూనెల శుద్ధీకరణలో కీలకంగా ఉన్న శుద్ధ గనులను మేజంర్ మైనింగ్ లలోకి మార్చ్ ఆలోచనలో ప్రభుత్వం ఉందని వెల్లడించారు. పరిశ్రమలను ప్రోత్స హించేందుకు ప్రణాళిక సిద్ధం చేసిందని తెలిపారు. ప్రభుత్వ భూములను వేలం వేసి అనుమతి ఇస్తామని తెలిపారు. పరిశ్రమలకు ఉచితంగా నీరు ఇస్తున్నామని చాలా మంది పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని వివరించారు. నూనె గింజల సాగు అన్ని జిల్లాలో అనుకూలమైన భూమి ఉందని వివరిం చారు. నూనెగింజల పంటలో వరి పంట కంటే 5 రెట్లు ఆదాయం నూనె గింజల సాగు వస్తుందని తెలి పారు. సుద్దను నూనెల పాటు ఎరువుల వినియో గంలోనూ ముఖ్య పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మెన్, వ్యాపారవేత్త లక్ష్మారెడ్డి సుద్ద ఫ్యాక్టరీ కంపెనీ సీఈవో కళ్యాణ్ చక్రవర్తి, జీఎం రామ్మోహన్, సుద్ధ ఫ్యాక్టరీ మేనేజర్ ఫనుజైన్, సుద్ధ పరిశ్రమ వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు.