Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వికారాబాద్ కలెక్టర్ పౌసుమీ బసు
నవతెలంగాణ-కుల్కచర్ల
గ్రామాలన్నీ పరిశుభ్రంగా, పచ్చదనంగా ఉంచేం దుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ పౌసుమీ బసు అన్నారు. ఏడో విడత హరిత హారం, నాలుగో విడత పల్లెప్రగతి కార్యక్రమాల్లో సో మవారం కుల్కచర్ల మండలం కామునిపల్లి గ్రామంలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ.. గ్రామాన్ని పరిశుభ్రంగా పచ్చదనంగా ఉంచేలా ప్రతి ఒక్కరి బాధ్యతాయుతంగా వహించాలన్నారు. పల్లెలను పచ్చగా ఉంచడమే ధ్యేయంగా మొక్కలు నాటుతున్నామని తెలిపారు. వాటిని సంరక్షించేందుకు కృషి చేయాలన్నారు. గ్రామంలోని ఎస్సీ కాల నీలో శిథిలావస్థలో ఉన్న భవనాన్ని తొలగించి కొత్త భవ నాన్ని నిర్మించుకొవాలని సూచించారు. ఇండ్లపై వే లాడే కరెంటు వైర్లను సరిచేయాలని, వంగిన, తుప్పు పట్టిన కరెంట్ స్తంభాలను తొలగించాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. డ్రయినేజీలను పరిశీలిం చి మురికి తొలగించాలని, మరమ్మతులు చేపట్టి, అవ సరమైన చోట కొత్త డ్రయినేజీల నిర్మాణం చేపట్టాలని సర్పంచ్, పంచాయతీ కార్యదర్శికి సూచించారు. ఇంటి కి తప్పనిసరిగా ఇంకుడు గుంతలను నిర్మించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని స్థానిక అధికారు లకు సూచించారు. రోడ్లపై చెత్తను వేయరాదని, గ్రా మాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఇంటి నుంచి తడి, పొడి చెత్తను సేకరించి డంపింగ్ యార్డ్ కు తరలించాలని పంచాయతీ కార్యదర్శికి సూచిం చారు. ఇంటింటికి ఆరు మొక్కల చొప్పున ఆమె మహి ళలు అందించారు. గ్రామంలో రోడ్లకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మహిపాల్‌రెడ్డి, జడ్పీటీసీ రాందాస్, డీఆర్డీవో కృష్ణన్, మిషన్ భగీరథ డీఈ సుబ్రహ్మణ్యం, ఎంపీడీవో నాగవేణీ, డీఎల్ పీవో అనితా, నోడల్ ఆఫీసర్ నవీన్ కుమార్, తహసీల్దార్ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి సుమలత, పలు శాఖల అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.