Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దోమ
ఈజీ మని కోసం అలవాటు పడి ఒక యువకుడు దొంగతనానికి పాల్పడ్డడు. దోమ ఎస్ఐ దేవంబోట్ల రాజు తెలిపిన వివరాల ప్రకారం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన నీరటి ప్రసాద్ జల్సాల కోసం అలవాటు పడి దొంగతనలకు చేస్తున్నట్టు తెలిపారు. గత నెల ఏప్రిల్ 30న మల్లేపల్లి తండాలో హనుమాన్ ఆలయంలో హుండీ పగలగొట్టి ఐదు వందల రూపాయలు, మే 26న కిష్టాపూర్‌లో రామస్వామి ఆలయం, కిష్టాపూర్ గ్రామంలో హనుమాన్ ఆలయంలో హుండీలు పగలగొట్టి ఐదువేల రూపాయలు, జులై 2న హుస్సేన్ నాయక్ తండా చివర నివాసం ఉన్న ఇంట్లో రాత్రి సమయంలో ఇంటిలో ఉన్న ఇనుప పెట్టేలో ఇరవై తొలల వెండి గోలుసులను దొంగ తనం చేశాడని తెలిపారు. తెల్లరుజామున 3 గంటల సమయంలో దిర్సంపల్లి నుంచి బుద్లాపూర్ గ్రామం వైపు పెట్రోలింగ్ వెళ్తున్న సమయంలో నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి ప్రసాద్‌ను అనుమానం వచ్చి పోలీస్ స్టేషన్ తీసుకు వచ్చినట్టు తెలిపారు. స్టేషన్లో పలు ప్రశ్నలు అడగగా పలు చోట్ల తనే దొంగతనలు చేసినట్టు ఒప్పుకోన్నాడని తెలిపారు. అధికారుల ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి రిమాండ్ తరలించినట్టు ఎస్ఐ దేవంబోట్ల రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది హిరలాల్, ఆంజనేయులు పాల్గొన్నారు.