Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ మంత్రి ప్రసాద్ కుమార్
నవతెలంగాణ-మర్పల్లి
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపడుతోందని మాజీ మంత్రి జి. ప్రసాద్‌కుమార్ అన్నారు. సోమ వారం కోటమర్పల్లి గ్రామానికి చెందిన డప్పు మహేందర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరస నగా పాదయాత్ర చేపట్టానున్నారు. కోట మర్పల్లి నుంచి వికారాబాద్ వరకు చేపట్టే పాదయాత్రను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని ఆరోపించారు. ఉద్యమకారులను పక్క న పెట్టి తెలంగాణ ద్రోహులను పార్టీలో చేర్చుకుని మంత్రి పదవులు కట్టబెట్టారని ఆయన మండిపడ్డారు. లక్ష రుణమాఫీ అంటూ రైతులను, ఇంటికో ఉద్యోగం, ని రుద్యోగ భృతి అంటూ నిరుద్యోగులను, దళితులకు 3 ఎక రాల భూమి, అంటూ అధికారం చేపట్టిన అప్పటి నుంచి ప్రజలను మోసం చేస్తూనే వస్తున్నారని ఆయన ఆరోపిం చారు. రేవంత్‌రెడ్డి పీసీఈ అధ్యక్షుడిగా నియామకం జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తోం దన్నారు. నాయకులు, కార్యకర్తల్లో ఉత్తేజం వచ్చిందన్నా రు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ జిల్లా మాజీ అధ్యక్షు డు ఖలీమోద్దీన్, మండల పార్టీ అధ్యక్షుడు రవీందర్, సీని యర్ నాయకులు కృష్ణారెడ్డి, వికారాబాద్ టౌన్ ప్రెసిడెం ట్ సుధాకర్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సతీ ష్‌రెడ్డి, మండల నాయకులు పట్లూర్ సురేష్, సంజీవరెడ్డి, సలీం, ప్రభాకర్, మధుకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.