Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పరిగి
పట్టణాలను అభివృద్ధి చేసేందుకే పట్టణ ప్రగతి అని ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డి అన్నారు. సోమవారం మున్సిపల్ పరిధిలో పట్టణ ప్రగతి- హరితహారం ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. 3, 7, 8వ వార్డుల్లో పట్టణ ప్రగతి పనులను మున్సిపల్ చైర్మన్ ముకుందా అశోక్ కుమార్‌తో కలిసి పరిశీలించారు. పట్టణ వాసులకు మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మొక్కలు నాటి నీరు పోశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణాల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పట్టణ ప్రగతి కార్యక్రమాన్నితీసుకొచ్చారని అన్నారు. రోడ్డుకు ఇరువైపులా ముళ్ళ పొ దలు తొలగించి మొక్కలు నాటాలని అధికా రులకు సూచించారు. శిథిలావస్థలో ఉన్న భవనాలను, ఐరన్ స్తంభాలను తొలగించా లని అన్నారు. లూస్ వైర్లను సరిచేయాలని అధికారులకు సూచించారు. అంతేకాకుండా మురుగునీటి కాలువలు కూడా శుభ్రం చే యాలని అన్నారు. అంతర్గత రోడ్లు, మురుగునీటి కాల్వల నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కల్లు ప్రసన్నలక్ష్మిశ్రీనివాస్రెడ్డి, కమిషనర్ ప్రవీణ్‌కుమార్, టీఆర్ఎస్ సీనియర్ నా యకులు కల్లు శ్రీనివాస్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, కౌన్సిలర్స్ వెంకటేష్, బి.రవికుమార్, కిరణ్‌కుమార్, గొల్ల రాము లమ్మ, నాయకులు మల్లేష్, అసిఫ్, ఆయా కాలనీ స్పెషల్ ఆఫీసర్లు, మహిళ అధ్యక్షురాలు లక్ష్మి, సునీత, అనేం ఆంజనేయులు, మున్సిపల్ సిబ్బంది, ఆయా కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.