Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రంలో రాజ్యాంగానికి విరుద్ధంగా పరిపాలన
- మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్
నవతెలంగాణ-మోమిన్‌పేట
టీఆర్ఎస్ పాలనపై ప్రజలు విసుగు చెంద డంతో పాటు రాష్ట్రంలో రాజ్యాంగానికి విరుద్ధంగా పరిపాలన సాగుతుందని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ర్కుమార్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో రాయల్ ఫంక్షన్ హాల్లో పార్టీ మండల అధ్య క్షుడు శంకర్‌యాదవ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్య కర్తల సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని దీమా వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి అధికారంలోకి వచ్చే విధంగా నిరంతరం కృషి చేయాలని సూచించారు. రాష్ట్రంలో మంత్రులకు, ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ లేదని కేవ లం వారు డమీల్గా కొనసాగుతున్నారని ఆయన ఎద్దే వా చేశారు. తెలంగాణలో కేసీఆర్‌కు దీటైన నాయకుడు రేవంత్‌రెడ్డి మాత్రమే అని అందుకు గ్రామాల వారీగా క మిటీలను వేసి పార్టీని పటిష్టం చేస్తామని అన్నారు. గ్రా మాల్లోని ప్రజలకు సహకరించి వారికి అవసరమైన సహా యం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు శంకర్ యాదవ్, సీనియర్ నాయ కులు సురేందర్, సుభాష్‌గౌడ్, మైపాల్, మహేందర్‌రెడ్డి, శ్రీరాములు, రుక్మారెడ్డి, వేమారెడ్డి, వెంకటయ్య, అశోక్, కాశం సాబ్, బాబు, ఉప సర్పంచ్ నరేష్, లాయక్ అలీ, మహేందర్, చంద్రయ్య, మైపాల్‌రెడ్డి, గిరిసింగ్, మో తిలాల్, ఆయా గ్రామాల పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.