Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ మాజీ మండలాధ్యక్షుడు చంద్రయ్య, ఇబ్రహీంపట్నం మాదిగ జేఎసీ అధ్యక్షుడు వినోద్ కుమార్
నవతెలంగాణ-మంచాల
దళిత సాధికారత పథకం చారిత్రక పథకం అని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఎర్పుల చంద్రయ్య, ఇబ్ర హీంపట్నం మాదిగ జేఏసీ అధ్యక్షుడు మంకు వినోద్ కుమార్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత సాధికారత పథకం దళితుల అభివృద్ధికి దోహదప డుతుం దన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు నౌసు ప్రవీణ్ కుమార్, పల్లాటి బాల్రాజు, తాళ్లపల్లి గూడ మాజీ సర్పంచ్ ఎర్పుల యాదయ్య, నాయకులు పంది పెంటయ్య, ఎర్పుల శ్రీనివాస్, బుర్ర గళ్ళ నరసింహ, ఎర్పుల మహేందర్, గ్యార కిషన్ తదితరులు ఉన్నారు.