Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి
నవతెలంగాణ-యాచారం
రోడ్ల అభివృద్ధే టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రధాన ఎజెండా అని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం ఈ సందర్భంగా విలేకర్లతో ఆయన మాట్లాడుతూ యాచారం మండల పరిధిలోని చిన్నతుండ్ల, చౌదర్పల్లి నుంచి యాచారం వరకు రోడ్డు అభివృద్ధికి రూ. 85 లక్షలు, చిన్నతుండ్ల నుంచి పెడ్డతుండ్ల వరకూ రోడ్ల అభివృద్ధికి రూ. 42 లక్షల నిధులు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసినట్టు చెప్పారు. మండల పరిధిలోని రోడ్ల అభివృద్ధితో పాటు,ఆ ప్రాంతమంతా సస్యశ్యామలం అవుతుందన్నారు. ఎక్కడ గతుకుల రోడ్లు కనిపించకుండా మర్మమతులు చేపడుతున్నట్టు వివరించారు. ఆయా ప్రాంతాల్లో రోడ్లు బాగుంటేనే, ఆ ప్రాంతాలకు కంపెనీలు రావడానికి సుముఖం చూపుతాయన్నారు. రాబోయే రోజుల్లో ఫార్మాసిటీతో యాచారం మండలం ఊహించని రీతిలో రూపు రఖలు మారి అభివృద్ధిలో ముందుంటుందన్నారు. ఫార్మాసిటీ అభి వృద్ధికి 2 పెద్ద రోడ్లు మంజూరైయినట్టు తెలిపారు. ఈ ప్రాంతంలో యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నట్టు ఎమ్మెల్యే వెల్లడించారు.