Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
నవతెలంగాణ-కొత్తూరు
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఏడో విడత హరితహారం కార్యక్రమం కొత్తూరులో వరుణుడు ముఖం చాటేయడంతో మందకొడిగా కొనసాగుతున్నది. మండలంలోని పలు గ్రామాల్లో ఆయా సర్పంచులు మొక్కలు నాటేందుకు తగిన ఏర్పాట్లను సిద్ధం చేసుకొని వరుణుడి రాకకోసం ఎదురు చూస్తున్నారు. సోమవారం విద్యుత్ అధికారులు మండల విద్యుత్ కార్యాలయం వద్ద హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ హాజరై మొక్కలను నాటారు. ఎమ్మెల్యే ఉత్సాహంగా తిరుగూ ప్రతి ఒక్కరిని పేరుపేరునా పిలిచి మొక్కలు నాటించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమంలో విరివిగా మొక్కలు నాటి విజయవంతం చేయాలని కోరారు. ప్రభుత్వ అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు, యువకులు, సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ గ్రూప్ సభ్యులు, వార్డు సభ్యులు బాధ్యత తీసుకొని పెద్ద మొత్తంలో మొక్కలు నాటాలని సూచించారు. మొక్కలు నాటిన వెంటనే చుట్టూ రక్షణ కంచెను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ అధికారులు డీఈ రాజారామ్‌రెడ్డి, ఏడీ రవికుమార్, ఏఈ లక్ష్మణ్, జడ్పీ వైస్‌చైర్మన్ గణేష్, కొత్తూరు మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య దేవేందర్ యాదవ్, వైస్‌చైర్మన్ డోలి రవీందర్, కౌన్సిలర్లు కోస్గి శ్రీనివాస్, బ్యాగరి ప్రసన్న లత యాదయ్య, ఎంపీటీసీ చింతకింది రాజేందర్‌గౌడ్, కొత్తూరు మాజీ ఎంపీటీసీ దేవేందర్ యాదవ్, నాయకులు కమ్మరి జనార్దన్ చారి, బ్యాగరి యాదయ్య, సిటీకేబుల్ వెంకటేష్, ఆంజనేయులుగౌడ్ పాల్గొన్నారు.